#shyamala dandakam
Explore tagged Tumblr posts
pslvtv · 2 years ago
Text
Sri Shyamala Devi Stuti in Telugu Lyrics | శ్రీ శ్యామలా దేవి స్తుతి | PSLV TV
1 note · View note
chaitanyavijnanam · 11 days ago
Text
శ్యామలా దేవి నవరాత్రులు - విశిష్టత, స్తుతి, దండకం (Shyamala Devi Navaratri - Significance, Stuti, Dandkam)
Tumblr media
🌹 శ్యామలా దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అందరికి Shyamala Devi Navaratri Good Wishes to All 🌹 ప్రసాద్ భరద్వాజ 🍀 శ్యామలాదేవి నవరాత్రుల విశిష్టత 🍀
మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు అని పిలుస్తారు.
శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిని అంటారు..అమ్మవారికి శ్యామల దేవి మంత్రి వారాహిమాత సేనాధిపతి.
శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి (మాతంగ ముని కుమార్తె)రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు.. దశమహావిద్య లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధ గా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ దశమహావిద్య సాధన మహా ప్రసిద్ధి ఈ పది విద్యలో ఏది ఉపాసించిన మిగతా తొమిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహావిద్య లో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన అన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది , అయితే ఈ దశమహావిద్యాలో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలో కి తెచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రి ని విశేషంగా జరుపుకుంటారు..
విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవి గా లలితా నామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా దేవి గురించి సహస్త్ర నామంలో ప్రస్తావించబడినది, అమ్మవారి కుడివైపు శ్యామలా దేవి, యడమవైపు వారాహి దేవి ఉంటారు..అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలా దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది.. అందుకే రాజశ్యామల అంటారు..
శ్యామలా దేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు ,కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు..త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాలనుండి రక్షించడానికి, ఈ తల్లి ఉపాసన ప్రసిద్దిగా చేస్తారు.
ప్రధానంగా , ప్రసంగం మరియు “నాడా” కంపించే ప్రతిధ్వని, మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది, పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల , అభివృద్ధికి , ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముకంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది.
శ్రీ శ్యామలా దండకం, శ్రీ శ్యామలా స్తుతి చాలా ప్రసిద్ధమైనవి. వీటిలో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యము కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసినది శ్యామల దండకం.
ఈ తొమ్మిది రోజులూ శ్యామలాదేవిని శ్రీ శ్యామలా స్తుతితో, దండకంతో ఆరాధించు కుందాం.
🌷. శ్రీ శ్యామలా స్తుతి 🌷
మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం |
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి 1
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే |
పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః 2
మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కడంబవనవాసినీ |
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే జయ లీలా శుక ప్రియే 3
శ్రీ స్స్వయం సర్వతీర్దాత్మికే సర్వామంత్రాత్మికే
సర్వతంత్రాత్మికే సర్వాముద్రాత్మికే |
సర్వశక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే
పాహిమాం పాహిమాం పాహి 4
ఇతి శ్రీ శ్యామలా స్తుతి సంపూర్ణం ||
🌹 🌹 🌹 🌹 🌹
🌹 శ్యామలా దేవి దండకం 🌹
శ్యామలా దేవి అనుగ్రహం లభిస్తే సర్వ విద్యలు భాసిస్తాయి. అధ్యయనాదులు లేనివారిని కూడా అమ్మవారు అనుగ్రహించగలదు. అలా అనుగ్రహిస్తే "అశ్రుత గ్రంధ భోధః" అనే సిద్ధిని ఇస్తుంది. అంటే ఎప్పుడు విని కూడా ఉండని గ్రంధంలోని విఙ్ఞానం బుద్ధికి స్ఫురింపజేస్తుంది. కనుక చిన్నతనం నుండి పిల్లల చేత శ్యామాలా దండకం చదివించినా, వినిపించినా చదువు, ఆరోగ్యం బాగుంటాయి. పదాలు పలుకుతున్నప్పుడు ఎక్కడ ప్రాణశక్తి స్పందిస్తుందో తెలియదు కానీ కొన్ని పదుల ప్రాణాయామములు చేసిన ఫలితం ఒక్క శ్యామలా దండకం చదివితే వస్తుంది.
🍀 శ్యామలా దండకం 🍀
ధ్యానమ్-
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి ౧
చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః ౨
వినియోగః-
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ ౩
స్తుతి-
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే ౪
దండకమ్-
జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే,సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వే��బిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ��వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,
సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ
మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే,
తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే,
పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,
సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహా��్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం
కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే,
పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం,
సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ||
🌹🌹🌹🌹🌹
0 notes
babu-r-itsme-blog · 5 years ago
Text
Watch "SRI SHYAMALA DANDAKAM" on YouTube
youtube
#StaySafe
Sri Vidya Lakshmi..🟡🔴
Vidhya Lakshmi🟡🔴
...Yaa Devi Sarvabhoothaesu Bhudhi Roopaena Samasthitha
Namasthasmai Namasthasmai Namasthasmai Namo Namaha..**
1 note · View note
onlygodis · 2 years ago
Text
Tumblr media
0 notes
sanathanadharmasblog · 7 years ago
Photo
Tumblr media
Manikhya veenaam upalalayanthim,
Madalasam manjula vaag vilasam,
Mahendra Neela dhyuthi komalangim,
Mathanga kanyam manasa smarami.    
SHYAMALA NAVARATROTSAVAM 17/1/2018 - 31/1/2018 Victory to The Divine Mother, Who Is One without a second, Whose compassion is always ascendant and Whose both hands surpass the beauty of the blooming lotus in the early morning. (19) Victory to The Divine Mother, before Whom bows Indra, Who is effulgent consciousness, Whose ear-globes shine and Whose nails give the impression of the orb of the rising moon, the diamond-studded rings on Her fingers giving out bright red rays creating the impression of evening twilight period (sayam sandhya). (20) Victory to The Divine Mother, Who showers wealth on those serving Her, Whose bosom is adorned by several gold chains studded with diamonds resembling a cluster of stars and Who is slightly bent (because of the weight of the breasts) and Who has wave-like folds in the middle which further enhance the beauty of what is already an diamond mine (or ocean) of beauty. (21) ~ SHYAMALA DANDAKAM ~
13 notes · View notes
omg-chandu-stuff-blog · 5 years ago
Text
Vedism and brahminism 26
Vedism and brahminism 26
Note : In this section let us talk about the shyamala dandakam by mahakavi kalidasa, which again has a practical significance in reference to art and culture. While one might argue on as to how this shyamala dandakam is related to dance and music, other devine practices, one needs to understand that in the last stanza of the this dandakam it engulfs whole of the theology of reciting this shyamala…
View On WordPress
0 notes
omg-chandu-stuff-blog · 5 years ago
Text
vedism and brahminism 27
vedism and brahminism 27
Note :
Let us get but further in reference tot he same post of shyamala dandakam, There is a very important point that the last verse of this dandakam talks about, that is the shriusti laya jathi and gathi is possible if and only if the existence of the stree /mother/shakthi/feminine was there. Today the universe would not have been there in case the stree existed. This is the brief gist…
View On WordPress
0 notes
omg-chandu-stuff-blog · 5 years ago
Text
Vedism and brahminism 25
Vedism and brahminism 25
Note :
In this section let us talk about the shyamala dandakam by mahakavi kalidasa, which again has a practical significance in reference to art and culture. While one might argue on as to how this shyamala dandakam is related to dance and music, other devine practices, one needs to understand that in the last stanza of the this dandakam it engulfs whole of the theology of reciting this…
View On WordPress
0 notes